అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ కొరత లేదు

అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది

Dharmendra Pradhan
Dharmendra Pradhan

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ కొరత లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్‌ తెలిపారు. అమెరికా- ఇరాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని అన్నారు. చమురు ధరల పెరుగుదలపై భయపడాల్సిన పనేమి లేదని ఆయన స్పష్టం చేశారు. అంతార్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరల పెరుగుదల ఎక్కువగా లేదన్నారు. గత రెండు రోజులుగా అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయని దర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. ఇంకా ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌, నాన్‌ ఒపెక్‌ దేశాలతో ప్రధానంగా క్రూడాయిల్‌ ధరలపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తున్నామని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు, శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని చమురు ఉత్పత్తి దేశాలు, బాధ్యత కలిగిన ప్రపంచ దేశాలకు తాము విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/