భారత్‌- చైనా సరిహద్దులో మూడో‌ జోక్యం అనవసరం

తేల్చి చెప్పిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్

india- china
india- china

బీజింగ్‌: భారత్, చైనా సరిహద్దు వివాదంలో మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్‌ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో చైనా ట్రంప్‌కు చురకలాంటిచింది. భారత్- చైనా మధ్య తలెత్తిన సరిహద్దు సమస్యలో మూడో పక్షం జోక్యం అనవసరమని తేల్చి చెప్పింది. ఈమేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ పై విధంగా తేల్చి చెప్పారు. ‘చైనా మరియు భారత్‌ మధ్య తలెత్తిన సరిహద్దు సంబంధ వివాదాల పరిష్కార మార్గాలున్నాయి. చర్చల మార్గాలు కూడా ఉన్నాయి. చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే సత్తా మాకుంది. మూడోపక్షం జోక్యం అనవసరం’ అని జావో లిజియన్ స్పష్టం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/