డబ్బు రాలేదా? అయితే ఈ నంబర్‌ను సంద్రించండి.

రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చే రూ.1500 పోస్టాఫీసు ద్వారా కూడా పంపిణి

money
money

హైదారాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ కోరకు లాక్‌డౌన్‌ విధించడంతో సామాన్య ప్రజలకు ఇది చాలా ఇబ్బందిగా మరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని రేషన్‌ కార్డుదారులందరికి ఉచిత రేషన్‌ పాటు, రూ.1500 లను వారి అకౌంట్‌లలో వేస్తుంది, ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలయి. లక్షల మంది అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. కాని వేల మంది తమకు ఇంకా ఆ డబ్బులు రాలేదని ఆరోపిస్తున్నారు. దీనిపై పౌరసరాఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి డబ్బు అందుతుందని భరోసా ఇచ్చారు. రేషన్‌ కార్డు దారుల బ్యాంక్‌ ఖతాలో నగదు జమ కాకుంటే వారు ఈ ల్యాండ్‌ లైన్‌ నంబర్లు 040-23324614, 23324615 కు గాని లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ 1967 కుగాని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. తపాల శాఖ ద్వారా కూడా నగదు పంపిణీ చేస్తున్నామని , రేషన్‌ కార్డును చూపించి నగదు పొందవచ్చని అధికారులు అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల బ్యాంక్‌ ఖతా లేని పేద కుటుంబాలకు ఉపయోపడుతుందని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/