మరింత విషమించిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం

Arun Jaitley
Arun Jaitley

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 9న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జైట్లీకి గురువారం డయాలసిస్ చేశారు. అయితే, శుక్రవారం ఆరోగ్యం మరింత విషమించినట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమాభారతి ఆసుపత్రికి చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఎయిమ్స్ వైద్యులు పదో తేదీ నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదు. అయితే, ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు ఈ నెల 20న వైద్య వర్గాలు తెలిపాయి. అనారోగ్య కారణాల వల్ల ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు.


తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/