చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతాం


అక్రమంగా నివసిస్తున్నవారు ఎక్కడున్నా వదలబోం

amith shah
amith shah

గౌహతి: చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జాతీయ పౌర జాబితా పట్టిక కేవలం అసోం వరకే పరమితం కాదని… దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారు ఎక్కడున్నా వదలబోమని చెప్పారు. గౌహతిలో జరిగిన నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయెన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చొరబాటుదారులెవరూ అసోంలో జీవించలేరని స్పష్టం చేశారు. దేశంలోని ఏ ప్రాంతంలో కూడా చొరబుటుదారుటకు చోటు ఉండదని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి బిజెపి చేరువకావాలని అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/