నోట్ల రద్దు ఆలోచనే లేదు : ఆర్బీఐ వెల్లడి
రూ.100, రూ.10, రూ.5 సిరీస్ నోట్లు చెలామణిలోనే…

New Delhi: పాత రూ.100, రూ.10 రూ.5 నోట్ల రద్దు అంటూ సోషల్ మీడియా లో ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. పాత కరెన్సీ నోట్లు రద్దు ఆలోచనే లేదని, దేశంలో రూ. 100, రూ.10, రూ.5 సిరీస్ నోట్లు చెలామణిలోనే ఉంటాయని, అవి ఏ నోట్లు అయి నా చెల్లుబాటు అవుతాయని వివరించింది.
పాత నోట్లు, కొత్త నోట్లు అనే తేడా లేదని, రెండు రకాల నోట్లతో ఎవరైనా.. దేశంలో ఎక్కడైనా లావాదేవీలు జరుపుకో వచ్చని తెలిపింది. ఈ మూడు రకాల పాత నోట్లను భవిష్యత్తులో కూడా ఉప సంహ రించుకోబోమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రూ.10 కాయిన్స్ కూడా చెల్లుబాటు లోనే ఉన్నాయని వివరించింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/