గోల్డ్ ఇటిఎఫ్ వద్దు.. ఈక్విటీయే ముద్దు
మార్కెట్లవైపు ఇన్వెస్టర్లు ఫోకస్

ముంబై: ఈక్విటీ మార్కెట్లు నష్టపోయినా, కరోనా వంటి పేండమిక్ అనిశ్చితి వచ్చినా మనకు మంచి ఆలోచన అంటే గోల్డ్ ఫ్యూచర్స్ అనే చెప్పాలి.
రిటైల్, హైనెట్ వర్త్ ఇన్వెస్టర్లు కూడా భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. ఇటీవల కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లు మార్చిలో భారీగా పతనం అయ్యాయి.
దీంతో ఇన్వెస్టర్లు భయంతో గోల్డ్ ఇటిఎఫ్ వైపు చూస్తున్నారు.
మనం ఇన్వెస్ట్మెంట్ చేసినదానికి భిన్నంగా లాభాలు వచ్చాయి. గత ఏడాది గోల్డ్ ఇటిఎఫ్‌లో ఇన్వెస్టర్లకు 32శాతం లాభం చూపించింది.
గోల్డ్ ఇటిఎఫ్ మార్కెట్లోకి రికార్డుస్థాయిలో రూ.6,244కోట్ల ఇన్‌ఫ్లోస్ కూడా వచ్చాయి. పేండమిక్ కారణంగా గోల్డ్ ఇటిఎఫ్వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. కానీ మళ్లీ 3 నెలలుగా పరిస్థితులు తిరగబడ్డాయి.
అనూహ్యంగా పెట్టుబడులు తగ్గాయి. ఫిబ్రవరిలో రూ.1400 కోట్లకుపైగా పెట్టుబడులు వస్తే, అక్టోబరులో రూ.400 కోట్లకు పరిమితం అయింది. ఆగస్టు వరకు కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది.
కానీ సెప్టెంబరు నుంచి తగ్గుముఖం పట్టినట్లు తాజా డేటా వెల్లడించింది.
పెట్టుబడులు తగ్గడంతో పాటు, పోర్ట్‌ఫోలియో రిజిస్ట్రేషన్లపైనా ఎఫెక్ట్ పడుతోంది. ఆగస్టు 2020 వరకూ నెలవారీగా కొత్తగా అకౌంట్లు భారీగా పెరిగాయి.
నెలకు యావరేజ్‌గా 5శాతం కంటే ఎక్కువే రిపోర్టు అయింది. కానీ ప్రస్తుతం ఇది రెండు శాతం మించడం లేదని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
గోల్డ్ ఇటిఎఫ్ మొత్తం ఖాతాలు అక్టోబరు నాటికి 7.38లక్షలు. గడచిన ఏడాది దాదాపు 108 శాతం పెరిగాయి. సహజంగానే గోల్డ్ ఇటిఎఫ్‌కు ఇన్‌ఫ్లోస్ తగ్గాయి.
దీంతో పాటు, బంగారం ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ఆగస్టులో భారీగా పెరిగిన ధరలు ప్రస్తుతం స్టేబుల్‌గా ఉంటాయని, ఇంతకంటే ఎక్కువ పెరగకపోవచ్చన్న అభిప్రాయం కూడా ఇన్వెస్టర్లలో నెలకొంది.
ఇలాంటి కారణాలతో ఇడిఎఫ్ నుంచి మార్కెట్లవైపు ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/