కాంగ్రెస్ పని ఇక అయిపోయినట్లే: అసదుద్దీన్ ఒవైసీ

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పూణెలో ఒక బహిరంగసభలో ప్రసగించిన హైదరాబాద్ ఎంపి మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, కాంగ్రెస్ ఇప్పటికప్పుడు కోలుకోవడం అసాధ్యమన్న ఒవైసి, కాల్షియం ఇంజెక్షన్ ఇచ్చినా కూడా గాడిన పడడం సాధ్యం కాదన్నారు. అక్టోబర్ 21న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పూణెలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. మహారాష్ట్ర హర్యానాలో జరగబోయే ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. దేశరాజకయీ చిత్రం నుండి కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్నారు.
బిజెపి కూడా టార్గెట్ చేస్తూ హిమాచల్ ప్రదేశ్‌లో మతమార్పిడులకు పాల్పడాలంటే ఒక నెల ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతూ బిల్ పాస్ చేయడం అత్యంత దారుణమన్నారు. ఇదే తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో బిల్లును తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. ఆలిండియా మజ్లిస్ ఈ ఇతెహాద్ ఉల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీచేసింది. ఆ సమయంలో ప్రకాష్ అంబేద్కర్ పార్టీ, బహుజన్ మమాసంఘ్, వంచిత్ బహుజన్ అగాధీ పార్టీలతో కలిసి పోటీ చేసింది. వంచిత్ బహుజన్ అగాధీ పార్టీ ఔరంగాబాద్ లోక్‌సభ స్థానాన్ని గెలుపొందింది. ఈ పార్టీ పోటీ చేయడంతో దళితులు, ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు చీల్చాయి. దీంతో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరిగింది. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇక అక్టోబర్ 21న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాష్ అంబేద్కర్‌కు చెందిన బిబిఎం పార్టీతో కలిసి పోటీ చేసేందుకు చర్చలు జరుపుతోంది. సీట్ల పంపకాల్లో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇదిలా ఉంటే విబిఎ పార్టీ మజ్లిస్‌తో కూడా చర్చలు చేయబోదన్న వస్తున్న వార్తలను ప్రకాష్ అంబేడ్కర్ ఖండిస్తూ తాను చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..https://www.vaartha.com/telengana/