ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిధులు లేవు

నోట్ల రద్దు, జీఏస్టీ వల్ల ఆర్థిక పరిస్థితి కుంటుపడింది

jagadeesh reddy
jagadeesh reddy

యాదాద్రి: ఎంపీటీసీల మాదిరిగానే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా నిధులు లేవని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి భువనగిరిలో జరిగిన పంచాయితీ రాజ్‌ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కంటే సర్పంచలకే ఎక్కువ నిధులు వస్తున్నాయన్నారు. నోట్ల రద్దు, జీఏస్టీ వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని మంత్రి తెలిపారు. అప్పుల్లో కూరుకున్న రైతులను ఆదుకోవడానికి రూ.లక్ష రుణమాఫీ చేసినా పరిస్థితి మెరుగు పడలేదన్నారు. దోమకాటుకు కూడా కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు. పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే ఇందుకు కారణమన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/