మందకృష్ణ బెదిరింపులకు భయపడేది లేదు

Pidamarthi Ravi
Pidamarthi Ravi

హైదరాబాద్‌: మందకృష్ణ ఏం చేసుకున్నా పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి స్పష్టం చేశారు. మందకృష్ణ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. కేసిఆర్‌ హామీ ఇచ్చినట్లుగా 125 అడుగుల విగ్రహాన్ని కచ్చితంగా పెడతామని, ఈ లోపులో గలాటా చేయాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. మందకృష్ణ వసూల్‌రాజా అని, 20 ఏళ్లలో ఆయన వసూళ్లపై సిబిసిఐడి విచారణను కోరుతూ తాము గవర్నర్‌ను కలుస్తామన్నారు. పంజాగుట్ట ఘటనపై మందకృష్ణ రాష్ట్రపతిని కలిసే ముందే తాము గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. అంబేద్కర్‌ వాదుల గర్జన వేదికగా మాట్లాడిన చెత్త నేతలంతా కలిసి దండుపాళ్యం బ్యాచ్‌ లాగా తయారై కేసిఆర్‌ను చెత్త కుప్పలో వేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/