ఏపీలో దిశ చట్టం అనేది లేదట

ఏపీలో రోజు రోజుకు మహిళలకు రక్షణ లేకుండా అయిపోతుంది. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రేమ పేరుతో కొంతమంది ..కామంతో మరికొంతమంది మహిళలపై దాడులు చేస్తున్నారు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్న ..పోలీసులు మాత్రం దాడులను అరికట్టలేకపోతున్నారు. రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో ఉందని..మహిళల ఫై దాడులు చేస్తే వెంటనే ఉరి అని నేతలు చెపుతుంటే పోలీసులు మాత్రం రాష్ట్రంలో దిశ చట్టం అనేది లేదని చెపుతున్నారు.

తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రస్తావించారు. ‘దిశ చట్టంతో ఉరిశిక్ష కూడా వేసేసామని మంత్రులు అంటుంటే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అలాంటి చట్టం ఏమి లేదని అంటున్నారు. 500 ఘటనలు జరిగినా కనీసం ఒక్క ఆడబిడ్డ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇవ్వలేని ముఖ్యమంత్రి.. నష్ట పరిహారం అందించి చేతులు దులుపుకునే ప్రభుత్వ ధోరణి వలనే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి’ అన్నారు. గుంటూరు లో సంచలం రేపిన రమ్య హత్య కేసులో నిందితుడికి ఇంకా శిక్ష ఖరారు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో నిందితుడిని 21 రోజుల్లో శిక్షించాలంటున్నారు.. ప్రతి రోజూ ఆ డెడ్‌లైన్‌ను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం 21 రోజుల తర్వాత స్పందించకపోతే మళ్లీ పోరాటం చేస్తానన్నారు. ఇప్పటికే పది రోజులు గడిచాయని గుర్తు చేసారు.

దిశ చట్టంతో ఉరిశిక్ష కూడా వేసేసామని మంత్రులు అంటుంటే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అలాంటి చట్టం ఏమి లేదని అంటున్నారు. 500 ఘటనలు జరిగినా కనీసం ఒక్క ఆడబిడ్డ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇవ్వలేని ముఖ్యమంత్రి..,(1/2)#JusticeForRamya pic.twitter.com/aZezBCnfD6— Lokesh Nara (@naralokesh) August 25, 2021

నష్ట పరిహారం అందించి చేతులు దులుపుకునే ప్రభుత్వ ధోరణి వలనే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇక 11 రోజులే మిగిలాయి రమ్య ని అంతం చేసిన క్రూరుడికి ఉరి ఎప్పుడు?(2/2)#JusticeForRamya— Lokesh Nara (@naralokesh) August 25, 2021