పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ స్పష్టత

ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..వెల్లడించిన పాఠశాల విద్యా శాఖ

school children
school children

హైదరాబాద్‌: తెలంగాణ కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతుంది. ఇలాంటి సందర్భంగా  రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించే దిశగా ఎటువంటి నిర్ణయమూ ఇప్పటివరకూ తీసుకోలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్నీ వెలువరించలేదని, తాము కూడా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ తెరిచేందుకు ఎలాంటి అనుమతులూ లేవని అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆన్ లైన్ తరగతుల నిర్వహణపైనా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిత్రా రామచంద్రన్ తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే, పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని తన ప్రొసీడింగ్స్ లో ఆమె స్పష్టం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/