ఎన్‌ఆర్సీ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

లోక్ సభలో లిఖితపూర్వకంగా సమాధానం

NRC
NRC

న్యూఢిల్లీ: జాతీయ జనాభా రిజిస్టర్‌ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌) ఎన్‌ఆర్సీ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసందర్భంగా ఎన్‌ఆర్సీఅమలుపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం ప్రకటించింది. ఎన్ఆర్సీకి మార్గం సుగమం చేసేందుకే పౌరసత్వ చట్టంలో సవరణలు చేశారంటూ పలు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేయడం గమనార్హం. అదికూడా పార్లమెంటులో లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ ఎన్ఆర్సీ అమలుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఆందోళనలు విరమించాలని కోరింది. కేరళ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు సీఏఏ అమలు చేయమంటూ తీర్మానాలు చేయడం, దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతుండడంతో కేంద్రం వెనుకడుగు వేసిందని భావిస్తున్నారు.

తాజ ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/