నిజామాబాద్‌ రూరల్‌ ఎంఆర్‌ఒ ఆత్మహత్య

Suicide
Suicide

నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ ఎంఆర్ఒ జోలగిరి శ్రీనివాసరావు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్యనగర్‌లోని తాను కిరాయికి ఉంటున్న ఇంట్లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలాన్ని కలెక్టర్ రామ్మోహన్‌రావు, పోలీసులు పరిశీలించారు. పని ఒత్తిడి కారణంగానే శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అతడి ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం శ్రీనివాసరావు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరావు ఆత్మహత్యతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/