‘విరాట పర్వం’లో కీలక పాత్ర.!

హీరోయిన్ నివేతా పెత్తురాజ్ కు ఆఫర్

Nivetha Pethuraj

మన టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “విరాట పర్వం”. ఎప్పుడో షూటింగ్ మొదలు కాబడిన ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు పరుగులు తీస్తుంది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్ ను మేకర్స్ హైదరాబాద్ లో చేస్తుండగా టాలెంటెడ్ హీరోయిన్ నివేతా పెత్తురాజ్ కు ఒక కీలక పాత్ర ఇచ్చినట్టు తెలుస్తుంది.

సినిమాలో ఈమె రోల్ అత్యంత కీలకంగా మారనుంది అని అలాగే ఈరోజు హైదరాబాద్ షూట్ లోనే ఆమె పాల్గొననుంది.

ఇక ఈ చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల ఒక సరికొత్త కంటెంట్ మరియు ఇంతకు ముందు ఎన్నడూ చూడని పాత్రలను డిజైన్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో రానా సరసన మరియు టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ వారు మరియు ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/