తీరం దాటిన ‘నివర్’- భారీ విధ్వంసం

మరో 3 రోజుల పాటు తుపాను ప్రభావం

Niver across the coast
Nivar across the coast

Chennai: తమిళనాడు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన తుపాను నివర్ ఈ తెల్లవారు జామున తీరం దాటింది.

  తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 145 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీచాయి.   నివర్  తమిళనాడు, పుదుచ్చేరిలలో విధ్వంసం సృష్టించింది.

పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 

తిరువణ్ణామలై, కడలూరు, విలుప్పురం, చెన్నై, కల్లకురిచ్చి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మరో మూడు రోజుల పాటు తుపాను ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/