నితీశ్ కుమార్‌కు షాక్.. బిజెపిలోకి ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు

ఆమోదించిన స్పీకర్

Nitish kumar
Nitish kumar

పాట్నాః జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్‌లో ఆ పార్టీకి ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు బిజెపిలో విలీనమయ్యారు. ఆ వెంటనే నితీశ్‌ను ఉద్దేశించి బిజెపి నేత, ఎంపీ సుశీల్ మోడీ ట్వీట్ చేస్తూ.. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ‘జేడీయూ ముక్త్’గా మారుతున్నాయని సెటైర్ వేశారు.

జేడీయూ ఎమ్మెల్యే విలీనాన్ని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. నితీశ్ కుమార్‌కు ఎదురుదెబ్బలు తగలడం గత 9 రోజుల్లో ఇది రెండోసారి. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్ జేడీయూ ఎమ్మెల్యే టెకి కసో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. 2019లో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జేడీయూ ఏడు సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత అందులో ఆరుగురు శాసనసభ్యులు బిజెపిలో చేరారు. ఆగస్టు 25న ఆ మిగిలిన ఒక్క ఎమ్మెల్యే కూడా బిజెపిలో చేరడంతో అక్కడ జేడీయూ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/