నేడు సోనియా తో లాలూప్రసాద్ , నితీశ్‌కుమార్ భేటీ

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆదివారం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్‌కుమార్ భేటీకానున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా బిజెపిని గద్దె దించాలని ప్రతిపక్షాలన్ని ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో బీహార్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు కాంగ్రెస్ చీఫ్‌తో సమావేశమవున్నారు. ఆదివారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్‌కుమార్ భేటీకానున్నారు.
గత ఐదేండ్లలో ఈ ముగ్గురు అగ్రనాయకులు కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఈ భేటీ లో కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నదని, అందులో జాతీయస్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలనే అంశం ఉండొచ్చునని అంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామపి లాలూప్రసాద్ యాదవ్ ప్రకటిచడం..దానిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆయన విరుచుకుపడడం తెలిసిందే. బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.