భయ్యాజీ జోషితో నితిన్‌ గడ్కరీ సమావేశం

Bhaiyyaji Joshi,Nitin Gadkari
Bhaiyyaji Joshi,Nitin Gadkari

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బిజెపి సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ, ఆరెస్సెస్ నేత భయ్యాజీ జోషితో సమావేశం అయ్యారు. దాదాపు రెండు గంటల సేపు వీరి సమావేశం కొనసాగింది. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందని గడ్కరీకి సంబంధించివారు చెబుతున్నారు. రానున్న ప్రభుత్వంలో గడ్కరీ పాత్ర ఏమిటనే విషయంపై చర్చించారని తెలిపారు. గడ్కరీకి కీలకమైన పదవిని అప్పజెప్పే అవకాశం ఉందని చెప్పారు.ఇదే సమావేశంలో పాల్గొన్న మరో బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగిందని చెప్పారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/