నిత్యానంద స్వామి చనిపోలేదట ..

నిత్యానంద స్వామి చనిపోయారంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న నేపథ్యంలో నిత్యానంద స్వామి ఆ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు. తాను సమాధిలోకి వెళ్లానని, శిష్యులు కంగారుపడొద్దని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి మాట్లాడలేకపోతున్నట్లు, మనుషులను గుర్తుపట్టలేకపోతున్నట్లు ఫేస్​బుక్​ పోస్ట్​లో పోస్ట్ చేసాడు. నిత్యానంద గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అప్ప‌ట్లో నిత్యానంద రాస‌లీల‌ల వీడియో తెగ వైర‌ల్ అవ్వ‌డంతో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

అయితే ఆ తర్వాత డ్ర‌గ్స్ వాడిన‌ట్టు ఆరోప‌ణ‌లు, అత్యాచర ఆరోప‌ణ‌లు, ఆశ్ర‌మంలో ఏనుగు దంతాలు, పులి చ‌ర్మాలు ఇలా ర‌క‌ర‌కాల కేసుల్లో క‌ట‌క‌టాల్లోకి వెళ్లిన నిత్యానంద బ‌య‌ట‌కు వ‌చ్చిన భార‌త్ వ‌దిలి రెండేళ్ల క్రితం ఈక్వెడార్ కు పారిపోయాడు. అక్క‌డ ఏకంగా త‌న కైలాసం అంటూ సొంత రాజ్యాన్ని స్థాపించాడు. ఈ క్రమంలో నిత్యానంద స్వామి మరణించారని కొన్ని రోజులుగా పుకార్లు రావడం తో నేను చనిపోలేదు.

ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను. నేను మరణించినట్లు కొందరు పుకార్లను వ్యాప్తిచేస్తున్నారు. నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. అందుకు కాస్త సమయం పడుతుంది. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నా. 27 మంది వైద్యులు నాకు చికిత్స చేస్తున్నారు అని తెలిపారు.