కాంతారా చిత్రాన్ని వీక్షించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంతారా చిత్రాన్ని వీక్షించి సినిమా ఫై ప్రశంసలు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. బెంగళూరులో తన వాలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం థియేటర్ లో కాంతారా సినిమా చూసినట్లు వెల్లడించారు. తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు కాంతారా ప్రతీకగా నిలిచిందని మంత్రి మెచ్చుకున్నారు. అక్కడి సంప్రదాయాలను చాలా బాగా చిత్రీకరించారని అన్నారు. ఈ సినిమాను తెరకెక్కించిన రిషబ్ షెట్టిపై నిర్మలా సీతారామన్ పొగడ్తల వర్షం కురిపించారు. థియేటర్‌లో దిగిన ఫొటోను కేంద్రమంత్రి షేర్‌ చేశారు.

ఇక ఎలాంటి పబ్లిసిటీ లేకుండా కన్నడ లో విడుదలైన కాంతారా…అక్కడ సూపర్ హిట్ తెచ్చుకొని , ఆ తర్వాత తెలుగు , హిందీ పలు భాషల్లో విడుదలైంది. కేవలం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు ..వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సినీ లవర్స్ చూడడం జరిగింది. ఈ సినిమాను చూడాలని సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు సైతం పోటీ పడుతున్నారు. తెలుగులో ఇప్పటికే ఈ సినిమా రూ. 50 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా రాబట్టి అరుదైన రికార్డును దక్కించుకుంది.