ఎర్రటి సంచితో బడ్జెట్..పార్లమెంటుకు చేరుకున్న నిర్మలమ్మ

డిజిటల్ ఆధారంగా బడ్జెట్ చదవనున్న ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: మరి కాసేపట్లో 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు, ఈ బడ్టెట్ ఎలా ఉండబోతోంది? కేంద్ర నుంచి ఎలాంటి ఊరటలు లభించనున్నాయి? ఎలాంటి ప్రకటనలు వెలువడనున్నాయి? వృద్ధి రేటును పెంచుకునే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వేటి ధరలు పెరగనున్నాయి? వేటి ధరలు తగ్గబోతున్నాయి? తమ రాష్ట్రాలకు బడ్డెట్ లో ఎలాంటి మేలు జరగబోతోంది? ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు ఎలాంటి తాయిలాలను ప్రకటించబోతున్నారు? తదితర ఎన్నో ప్రశ్రలు అందరి మదిలో మెదులుతున్నాయ.

నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం పార్లమెంటుకు చేరుకున్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు, అధికారులతో కలిసి పార్లమెంటు భవనం ముందు ఆమె ఫోటోలు దిగారు. సంప్రదాయబద్ధంగా జాతీయ చిహ్నం ఉన్న ఎర్రటి సంచిలో ఆమె బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు. మరోవైపు ఈ సారి కూడా సభలో ఆమె పేపర్ లెస్ బడ్డెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. అంటే… పేపర్ ఆధారంగా కాకుండా డిజిటల్ ఆధారంగా ఆమె బడ్జెట్ ను చదవనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/