హాస్పటల్ నుండి డిశ్చార్జి అయిన నిర్మలా సీతారామన్

అనారోగ్యానికి గురై..హాస్పటల్ లో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిశ్చార్జి అయ్యారు. సోమవారం స్వల్ప కడుపు నొప్పితో ఢిల్లీలోని ఎయిమ్స్‭లో నిర్మలా సీతారామన్ చేరారు. మూడు రోజుల చికిత్స అనంతరం గురువారం ఆమె హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలా ఉంటె వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న సమర్పించే కేంద్ర బడ్జెట్-2023ని ఖరారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మంతనాలు జరుపుతోంది. నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రీబడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. వచ్చే ఏడాది బడ్జెట్ మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ కానున్నది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం రెండో టర్మ్ ఏప్రిల్-మే 2024కల్లా ముగియనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను సమర్పించే వార్షిక బడ్జెట్ తయారీ ప్రక్రియ అక్టోబర్ 10 నుంచే ఆరంభమైంది. ఇక సీతారామన్ కొంత విశ్రాంతి అనంతరం, బడ్జెట్ రూపకల్పన కసరత్తుల్లో పాలుపంచుకోనున్నారు.