రానున్న 25ఏళ్ళ అమృత కాలానికి నాంది

బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సీతా రామన్

Nirmala Sitha Raman in the budget speech
Nirmala Sitha Raman in the budget speech

New Delhi: పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వార్షిక బడ్జెట్​ 2022-23 ప్రసంగాన్ని ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్‌ పునాది పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది కానుందని పేర్కొన్నారు. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుందన్నారు. గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ పరుగు ఆరంభం అయిందని చెప్పారు. . వచ్చే 25 ‘సంవత్సరాల్లో భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా చెప్పారు. కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ చాలా ఉపయోగ పడిందని ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకాలు కీలకపాత్ర పోషించాయని పేర్కొన్నారు

తెర (సినిమా ) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/