బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాలు పోవు

Nirmala Seetaraman
Nirmala Seetaraman

New Delhi:  బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాలు ఎక్కడికీ పోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆంధ్రా బ్యాంకు సహా పది బ్యాంకుల్ని విలీనం చేస్తున్నట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగుల్లో కోత పడుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. అయితే దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ‘‘నేను దీనిపై ఇంతకు ముందే స్పష్టనిచ్చాను. బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాలు పోవన్నారు. ప్రతి బ్యాంకుకు ఇది వరకే ఈ సమాచారం చేరవేశాం’’ అని అన్నారు.

జీఎస్టీ తగ్గింపు తన చేతుల్లో లేదని, దానిపై నిర్ణయం జీఎస్టీ మండలి తీసుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఆదివారం చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై విలేకరులు ప్రశ్నించగా.. ”కొంత మంది బ్యాంకు ఉద్యోగులు విలీనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మేం బ్యాంకులను మూసివేయడం లేదు. ప్రస్తుతమున్న బ్యాంకులో వారు చేస్తున్న దానికి భిన్నంగా చేయమని మేం అడగడం లేదు. బ్యాంకులు పుంజుకొనేందుకు మేము వాటికి ఎక్కువ సామర్థ్యాన్ని ఇచ్చినట్లయింది.”అని సీతారామన్‌ అన్నారు.