నిర్భయ దోషులకు ఉరి..చివరి కోరిక ఏంటని అడిగితే..

నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయనున్నారు

nirbhaya convicts
nirbhaya convicts

న్యూఢిల్లీ: నిర్భయ దోషులు నలుగురిని తిహార్‌ జైల్లో ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం 6గంటలకు ముకేశ్‌ సింగ్‌, వినయ్‌శర్మ, పవన్‌ గుప్తా, అక్షయ్‌ సింగ్‌లను ఉరితీసేందుకు డెత్‌ వారెంట్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు దోషులకు చివరి కోరిక చెప్పాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. వాళ్లు ఏ సమాధానం ఇవ్వలేదట. ఏ ఒక్క ప్రశ్నకు కూడా జవాబివ్వలేదట. ఉరి శిక్ష దగ్గరపడుతుందన్న భయంతో వాళ్లు ఆహారం తక్కువగా తింటున్నారట. టెన్షన్ టెన్షన్‌గా ఉంటున్నారట. నలుగురికీ వైద్యులు రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెడికల్ రిపోర్టుల్లో ఆరోగ్యం బాగానే ఉంటున్నట్లు తేలుతోందట. కాగా, వీరి సెల్ బయట గార్డులు గట్టిగానే కాపలా కాస్తున్నారు. ఇదిలా ఉండగా, చివరి కోరిక ప్రకారం.. కుటుంబ సభ్యులు, దగ్గరి వారిని కలవటం, తనకు చెందిన స్థిరాస్తులు మరొకరికి బదిలీ చేయటం, ఏదైనా పుస్తకం కావాలని కోరడం, ఆధ్యాత్మిక గురవును కలవడం వంటివి కోరవచ్చు. అవి న్యాయసమ్మతంగా ఉంటే.. ఆ కోరికలను నెరవేర్చుతారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/