వినయ్ ఎవరినీ గుర్తు పట్టడం లేదన్న లాయర్
జైలు గోడకు తలను బాదుకున్న వినయ్ శర్మ

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మార్చ్ 3వ తేదీన ఉరితీతను అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనను తాను గాయపరుచుకున్నాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అనంతరం అతనికి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో అతని తరపు లాయర్ మాట్లాడుతూ, వినయ్ శర్మ ఎవరినీ గుర్తు పట్టలేకపోతున్నాడని… కన్న తల్లిని కూడా గుర్తించలేదని చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ ఆసుపత్రికి వినయ్ ను రెఫర్ చేయాలని కోరారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/