నేడు నిర్భయ దోషుల క్యూరేటివ్‌ పిటిషన్‌పై విచారణ

Nirbhaya-case-convict-Vinay-Kumar
Nirbhaya-case-convict-Vinay-Kumar


న్యూఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో నిర్భయ కేసులో ఇద్దరు దోషుల క్యూరేటివ్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. 2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, చంపిన నేరస్థులు ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31)లను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇందులో వినయ్ శర్మ, ముకేష్ క్యూరేటివ్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం గంట 1.45 నిమిషాలకు సుప్రీంకోర్టు విచారించనుంది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వీరి పిటిషన్‌ను పరిశీలించనుంది. ఎన్వీ రమణ, అరుణ్ మిశ్ర, ఆర్ఎఫ్ నారిమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషన్ ఈ బెంచ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే… ఇప్పటికే నిర్భయ కేసులో అక్షయ్ కుమార్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు మరో ఇద్దరు దోషుల విషయంలో కూడా ఇదే జరుగుతందని దేశ ప్రజలు భావిస్తున్నారు. వీరిని ఈనెల 22న ఉరి తీసేందుకు తీహార్ జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉరితాళ్లను కూడా సిద్దం చేశారు. నలుగురిని ఒకేసారి ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/