నిర్భయ దోషులకు మార్చి 20న ఉరిశిక్ష
ఆదేశాలు జారీ చేసిన పాటియాలా హౌస్ కోర్టు

న్యూఢిలీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. మార్చి 20న ఉదయం 05.30 గంటలకు దోషులను ఉరితీయాలని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నలుగురు దోషులు ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ కుమార్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ సింగ్ (31)నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయనున్నారు. అయితే దోషులకు ఉన్న అవకాశాలన్నీ ముగియడంతో ఈసారి ఉరిశిక్ష పడడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/