శ్రీలంకలో 9 మంది ముస్లిం మంత్రులు రాజీనామా

Sri Lanka's Muslim cabinet members
Sri Lanka’s Muslim cabinet members

శ్రీలంక: శ్రీలంకలో తొమ్మిది మంది ముస్లిం మంత్రులు రాజీనామా చేశారు. ఇటీవ‌ల శ్రీలంక‌లో ఈస్ట‌ర్ పండుగ వేళ ఆత్మాహుతి దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ దాడుల్లో సుమారు 250 మంది వ‌ర‌కు మ‌ర‌ణించారు. అయితే ఆ దాడుల‌కు ముస్లింలే కార‌ణ‌మంటూ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు మిన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం మ‌తానికి చెందిన 9 మంది మంత్రులు, మ‌రో ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్లు కూడా త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేశారు. అయితే ఇందులో న‌లుగురు క్యాబినెట్ హోదాలో ఉన్నారు.ముస్లింల‌ను అన్యాయంగా వేధిస్తున్నార‌ని ముస్లిం నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈస్ట‌ర్న్‌, వెస్ట‌ర్న్ ప్రావిన్సుల‌కు చెందిన గ‌వ‌ర్న‌ర్లు హిజ్‌బుల్లా, ఆజాత్ స‌ల్లేలు రాజీనామా చేశారు. మ‌రో వైపు బౌద్ధ మ‌త‌పెద్ద అతుర‌లియే ర‌త్న థేరో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేప‌ట్టారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/