ఘోర ప్ర‌మాదం .. 9 మంది మృతి

ఘోర ప్ర‌మాదం .. 9 మంది మృతి
bus-accident-in-nepal

ఖాట్మండు: గత రాత్రి 10:30 గంట‌ల‌కు నేపాల్‌లోని ద‌శ‌ర‌థ్ చంద్ హైవేపై ఘోర రోడ్డుప్ర‌మాదం సంభవించింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘటనలో ప్ర‌మాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో 34 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న పోలీసులు.. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం దాదిల్‌దూర జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదంలో బ‌స్సు య‌జ‌మాని బీరేంద్ర క‌ర్కి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. య‌జ‌మానే డ్రైవింగ్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/