వర్షంలోనే వరద బాధితులకు సాయం చేస్తున్న పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు

ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదలకు గోదావరి జిలాల్లో చాల గ్రామాలూ ముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలో రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో పాటు పార్టీ నేతలు ముంపు గ్రామాల్లో పర్యటించి బాధితుల బాధలు తెలుసుకున్నారు. ఇప్పుడిప్పుడే గోదావ‌రి వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న ప్రాంతాలు వ‌ర‌ద నీటిలో నుంచి బ‌య‌ట‌ప‌డుతుండ‌గా… మంగ‌ళ‌వారం మ‌రోమారు వ‌ర్షం మొద‌లైంది. ఇదిలా ఉంటె ఓ పక్క వర్షం పడుతున్నప్పటికీ ఆ వ‌ర్షంలోనే త‌డుస్తూ వ‌ర‌ద బాధితుల‌కు నిత్యావ‌స‌రాలు అందిస్తున్నారు పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు నిమ్మ‌ల రామానాయుడు..ఎన్టీఆర్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున వ‌ర‌ద బాధితుల‌కు నిత్యావ‌స‌రాలు అందజేస్తున్నారు. దీనికి సంబదించిన వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేసారు.

శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు వరద బాధితులను వరద బాదితుల కోసం ఖర్చు పెట్టాలని ఇచ్చిన “పిలుపు మేరకు” నాయకులు , కార్యకర్తలు అందరూ కలసి ఇచ్చిన సహాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున ఈ రోజు కంచు స్థంభం పాలెం , బురుగుపల్లి బాదితులకు అందజేస్తున్నట్లు పోస్ట్ చేసారు.

శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు వరద బాధితులను వరద బాదితుల కోసం ఖర్చు పెట్టాలని ఇచ్చిన “పిలుపు #మేరకు” నాయకులు , కార్యకర్తలు అందరూ కలసి ఇచ్చిన సహాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున ఈ రోజు #కంచు స్థంభం పాలెం , #బురుగుపల్లి బాదితులకు అందిస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, MLC అంగరతో.. pic.twitter.com/mruVtMSATc— Nimmala Ramanaidu (@RamanaiduTDP) July 26, 2022