ఏపి ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించడం లేదు..హైకోర్టు

ap high court
ap high court

అమరావతి: నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి వినతీ పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరాల్సిందిగా సూచించింది. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఈ సందర్భంగా హైకోర్టు మండిపడింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం గవర్నర్‌కు ఉందని ఈ సదర్భంగా ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్నిఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/