మరోసారి పంచాయతీరాజ్‌ శాఖపై నిమ్మగడ్డ ఆగ్రహం

తన ఆదేశాలను పట్టించుకోని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లను ఆఫీసుకు రావాలన్న నిమ్మగడ్డ

అమరావతి: ఏపి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ మరోసారో పంచాయతీరాజ్‌ శాఖపై అసహనం వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను సక్రమంగా అమలు చేయడం లేదని ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ… తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ ద్వారా ఎందుకు స్వీకరించలేదని పంచాయతీరాజ్ శాఖను ప్రశ్నించారు. అంతేకాదు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్ లను తన కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించారు.

గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్నారని, నామినేషన్ల పత్రాలను చించేశారని పలు పార్టీలు ఆరోపించాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఆన్ లైన్ ద్వారా కూడా నామినేషన్లు వేసే వెసులుబాటు కల్పించాలని కోరాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/