నిఖిల్‌ విజయేంద్ర, నిహారిక కొణిదెల వెబ్‌ సిరీస్‌ ప్రారంభం

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర

Nikhil Vijayendra, Niharika Konidela's Web Series
Nikhil Vijayendra, Niharika Konidela’s Web Series

మెగాడాటర్‌ నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలో కొత్త వెబ్‌ సిరీస్‌ శుక్రవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు.

యూ ట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర ఇందులో నటిస్తున్నారు. ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ పూజా కార్యక్రమాలను నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభిచారు.

స్టార్‌ రైటర్‌ విజయేందప్రసాద్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శక నిర్మాత భాను రాయుడుకి స్ట్రిప్ట్‌ను అందించారు. యంగ్‌ ప్రొడ్యూసర్‌ హర్షిత్‌ రెడ్డి బ్యానర్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. దర్శక నిర్మాత భాను రాయుడు మాట్లాడుతూ “ప్రస్తుతం డిజిటల్‌ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే.

కొత్త కాన్సెప్టులతో వెబ్‌ సిరీస్‌లు రూపొందుతున్నాయి. ఆ కోవలో మా రాయుడు చిత్రాలు బ్యానర్‌పై ఫాంటసీ డ్రామా జోనర్‌లో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించడానికి కథను సిద్ధం చేశాం. ఎవరూ సరిపోతారని ఆలోచించాం.

నిహారిక గారైతే మా కథకు న్యాయం చేస్తారనిపించి ఆమెను సంప్రదించి కథ వినిపించాం. ఆమె ఓకే చెప్పారు. అలాగే ప్రముఖ యూ ట్యూటర్‌ నిఖల్‌ విజయేంద్ర ఇందులో నటిస్తున్నారు. ప్రముఖ యాంకర్‌ అనసూయగారు కీలక పాత్రను పోషిస్తున్నారు. త్వరలోనే మా వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది” అన్నారు.

నటీనటులు:నిఖిల్‌ విజయేందర్‌, నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్‌, అస్తా మాలిక్‌, హారిక, వసంత్‌ సమీర్‌ తదితరులు .

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/