రోహిత్‌పై నమ్మకం ఉంచండి: నిఖిల్‌ చోప్రా

NIKHIL CHOPRA1
NIKHIL CHOPRA1

రోహిత్‌పై నమ్మకం ఉంచండి: నిఖిల్‌ చోప్రా

న్యూఢిలీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో రాణిస్తూ, అవసరమైనప్పుడు సారథ్య బాధ్యతలు వహించి టీమిండియా విజయాల్లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్‌ టీమిండియా గెలవడంలో రోహిత్‌ శర్మ ప్రధాన పాత్ర పోషించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎదురులేని రోహిత్‌, టెస్టుల్లో మాత్రం అవకా శాలు లేక నిరాశే చెందుతున్నారు. ప్రస్తుత ఫామ్‌, ఇంగ్లాండ్‌లో కోహ్లీ సేన ఘోర ఓటమి అనంతరం వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో రోహిత్‌కు అవకాశం దక్కుతుందని అందరూ భావించారు.

కానీ సెలెక్టర్లు ఆశ్చర్యకరంగా మరోసారి రోహిత్‌ను పక్కకు పెట్టేశారు. టెస్టులకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల ఇప్పటికే సౌరవ్‌ గంగూలీ, హర్భజన్‌ సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలో మాజీ క్రికెటర్‌ నిఖిల్‌ చోప్రా కూడా చేరారు. టెస్టుల్లో విదేశీ పిచ్‌లపై ప్రస్తుతమున్న ఆటగాళ్లలో సారథి విరాట్‌ కోహ్లీ తర్వాత ఎక్కువ పరుగులు చేసింది రోహిత్‌ శఱ్మనే. కానీ సెలక్టర్లు అతడిపై ఎందుకు నమ్మకం ఉంచడంలేదు. గత ఐదు టెస్టు సిరీస్‌ల నుంచి అతడిని పక్కకు పెట్టారు. ఒకటి రెండు టెస్టుల్లో రోహిత్‌ విఫలమవ్వచ్చు. కానీ వరుస అవకాశాలు ఇస్తేనే రోహిత్‌ తానేంటో నిరూపించుకుంటాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. టెస్టుల్లో కూడా కూడా సెలక్టర్లు అవకాశాలు ఇవ్వాలి అంటూ నిఖిల్‌ చోప్రా తెలిపారు. విదేశాల్లో రోహిత్‌ శర్మ ప్రదర్వన చూస్తే 14 టెస్టుల్లో 58 సగటుతో 583 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా 25 టెస్టుల్లో 39.97 సగటుతో 1479 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 9 అర్థ సెంచరీలు ఉన్నాయి. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెలెక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టెస్టుల్లో వరుసగా విఫలవుతున్న రెగ్యులర్‌ ఓపెనర్లు విజ§్‌ు, ధావన్‌లను పక్కకుపెట్టి కర్ణాటక ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌, ముంబై యువ సంచలనం పృథ్వీషాలను ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో గాయాలతో ఇబ్బందులు పడిన బౌలర్లు ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌, జస్ప్రిత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు.