నీర్వాణ సినిమాస్‌ ప్రొడక్షన్‌ నెం1 ప్రారంభం

NIHARIKA NEW MOVIE
NIHARIKA NEW MOVIE

నీర్వాణ సినిమాస్‌ ప్రొడక్షన్‌ నెం1 ప్రారంభం

హీరో రాహుల్‌ విజ§్‌ు, మెగా హీరోయిన్‌ నిహారిక హీరోయిన్‌గా తెరకెక్కబోతున్న రొమాంటిక్‌ కామెడీ సినిమా శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. నాగబాబు క్లాప్‌ ఇవ్వగా హీరో వరుణ్‌తేజ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈసందర్భంగా దర్శకుడు ప్రణీత్‌ బ్రమనందపల్లి మాట్లాడారు.. ముద్దపప్పు ఆవకా§్‌ు, నాన్నా కూచి వెబ్‌ సిరీస్‌ తర్వాత తొలిసారిగా ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 25నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. హీరో రాహుల్‌ విజ§్‌ు మాట్లాడుతూ, డైరెక్టర్‌ ప్రణీత్‌ స్క్రిప్టు చెప్పినపుడు తనకుబాగా నచ్చిందని . శేఖర్‌ కమ్ముల స్ల్టైల్‌లో ఈసినిమా ఉంటుందని తెలిపారు. నా తొలి సినిమా ఈ మాయ పేరేమిటో సొంత నిర్మాణసంస్థలోచేశానని, కథ నచ్చటంతో బయటి బ్యానర్‌లో సినిమా చేయటానికి ఒపుకున్నట్టు తెలిపారు.. శివాజీరాజా ఈసినిమాలో ముఖ్యపాత్రలో కన్పించబోతున్నారన్నారు.
నీరహారిక మాట్లాడుతూ, ఈసంస్థ నీర్వాణ సినిమాస్‌.. ఈసినిమాతో చిత్ర నిర్మాణం మొదలుపెడుతున్నారన్నారు. వారికి ఆల్‌దిబెస్ట్‌ అన్నారు. డైరెక్టర్‌ ఈచిత్రాన్నికొత్తగా తెరకెక్కించబోతున్నారన్నారు.. అందరికీ ఈసినిమా నచ్చుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రాజ్‌ నిహార్‌, శివాజీరాజా మాట్లాడారు.