పింక్ లో పెళ్లికూతురు..

ఆ టాట్టూ సంథింగ్ స్పెషల్!

కుందనపు బొమ్మ నిహారిక కొణిదెల వివాహ మహోత్సవం ప్రస్తుతం ట్రెండీ టాపిక్. మెగా-అల్లు హీరోలు సహా పరిమిత అతిథుల సమక్షంలో జరుగుతున్న ఈ వివాహానికి సంబంధించిన ప్రతిదీ అంతర్జాలంలో ట్రెండింగ్ గా మారుతున్నాయి.

ఇప్పటికే సంగీత్ మెహందీ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. తాజాగా పెళ్లి కుమార్తె నిహారిక కొణిదెల పింక్ డిజైనర్ డ్రెస్ లో డ్యాన్సులు చేస్తున్న వీడియో అంతర్జాలంలోకి రిలీజైంది.

కొత్త పెళ్లి కూతురు ఎంతో ఆనందంగా నవ్వులు చిందిస్తూ సందడి చేస్తుంటే తన చుట్టూ ప్యాన్ చేసిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.ఇక నిహారిక షోల్డర్ దిగువ భాగంలో టాట్టూ ఈ వీడియోలో హైలైట్ అయ్యింది.

Niharika

ఇక ట్రెడిషనల్ లుక్ లో కొణిదెల వారమ్మాయి ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ వేడుక ఆద్యంతం ఎంతో జాయ్ ఫుల్ గా కనిపిస్తున్న నిహారిక వీడియోలు క్లిక్ లు లైక్ లతో అంతర్జాలంలో షేక్ చేస్తున్నాయి. ఇంతకుముందు ఓ వీడియోలో నాగబాబు స్టెప్పులేస్తూ కనిపించగా.. మరో వీడియోలో హబ్బీ చైతన్యతో కలిసి నిహారిక స్టెప్పులేస్తూ కనిపించారు.

ఉదయ్ పూర్ విలాస్ నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందుతూనే ఉన్నాయి. నేటి సాయంత్రం 7 గంటలకు ఈ వివాహం జరగనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/