వైఎస్‌ఆర్‌సీపీ లో చేరిన జయసుధ

హైదరాబాద్‌ : నేడు మాజీ ఎమ్మెల్యే ,సినీ నటీ జయసుధ,ఆమె కుమారుడు నిహార్‌ కపూర్‌ వైఎస్‌ఆర్‌సీపీ లో చేరారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో జగన్‌ తన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్యానించారు.ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రావడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డే కారణమని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జగన్ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తానని తెలిపారు. జగన్ ఆదేశాల మేరకు పని చేస్తానని జయసుధ స్పష్టం చేశారు.