కర్ణాటక లో నేటి నుంచి రాత్రి క‌ర్ఫ్యూ

సీఎం యెడ్యూరప్ప ప్రకటన

Karnataka CM BS Yediiyurappa
Karnataka CM BS Yediiyurappa

Bangalore: కొత్త రకం కరోనా వైరస్‌ వెలుగు చూసిన నేప‌థ్యం లో వ్యాప్తి నిరోధ‌క చ‌ర్య‌ల‌కు క‌ర్నాట‌క ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కొత్త ర‌కం వ్యాధి ల‌క్ష‌ణాలు కేసులు బ‌య‌ట‌ప‌డ‌న‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త‌లు ముమ్మ‌రం చేసింది..

ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క రాష్ర్ట లో గురువారం నుంచి రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని, ఇది జ‌న‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు అమ‌ల‌వుతుంద‌ని క‌ర్ణాట‌క సీఎం యెడ్యూరప్ప ప్ర‌క‌టించారు

ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని సీఎం కోరారు. కాగా బ్రిట‌న్‌లో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో క‌ర్ణాట‌కకు వ‌చ్చే అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌పై దృష్టి సారించామ‌ని తెలిపారు. కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ కార‌ణంగానే రాష్ర్టంలో నైట్ క‌ర్ఫ్యూ విధించామ‌ని పేర్కొన్నారు.

నేటి నుంచి జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు రాత్రిళ్లు ఎలాంటి సెల‌బ్రేష‌న్స్‌కు అనుమ‌తి ఇవ్వబో‌మ‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనా నియ‌మ నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు యెడ్యూరప్ప పిలుపు ఇచ్చారు..

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health1/