ఢిల్లీలో అరెస్టయిన నైజీరియా సెలబ్రిటీ

అక్రమంగా భారత్‌లో నివాసం

delhi airport
delhi airport

న్యూఢిల్లీ: నైజీరియా సెలబ్రిటీ ఢిల్లీ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించడంతో సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ సిబ్బంది అతన్ని ప్రశ్నించింది. వారు వేసిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలివ్వడంతో వారికి అనుమానం వచ్చి అతన్ని ఉన్నతాధికారులకు అప్పగించారు. సైజీరియాకు చెందిన ఒలామిలేకన్‌ ఎం అకన్బీ ఒజోరా అనే ఒక సినిమాస్టార్‌ ను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అరెస్టు చేశారు. అతను గోవా వెళ్లేందుకు విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నట్లు చెప్పారు. అతను పొంతనలేని సమాధానాలు చెపుతుండడంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు సమాచారం అందించినట్లు చెప్పారు. ఒలామిలేకన్‌ వీసా 2011లో ఎక్స్‌పైర్‌ అయిందని, అప్పటి నుంచి అతను అక్రమంగా భారత్‌లో ఉన్నారని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. ఒలామిలేకన్‌ భారత్‌లోని చాలా హిందీ సినిమాల్లో నటించాడని అధికారులు వెల్లడించారు. నైజీరియాలో ఒలామిలేకన్‌కు స్టార్‌ స్టేటస్‌ ఉందని అక్కడ ఆయనో పెద్ద సెలబ్రిటీ అని అధికారులు గుర్తించారు. అతనిపై తదుపరి విచారణ జరుగనుందని అధికారులు చెప్పారు. భారత్‌లోకి చాలామంది అక్రమంగా ప్రవేశించి ఇక్కడే నివాసం ఉంటున్నారని, అయితే సెలబ్రిటీలే ఇలా వ్యవహరించడంపై అధికారులు సీరియస్‌ అవుతున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/