ఆ మాటల్లో నిజం లేదు

NIDHI AGARWAL-1
NIDHI AGARWAL

ఆ మాటల్లో నిజం లేదు

అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సవ్యసాచి.. ఈచిత్రంతో హీరోయిన్‌ తెలుగు తెరకుపరిచయం కాబోతోంది బాలీవుడ్‌ భామ నిధి అగర్వాల్‌.. దీని తర్వాత ఆమె అఖిల్‌ సరసన కూడ నటించబోతోందని అంటున్నారు.. ఇదిలా ఉండగా నిధి ఫిలిం కెరీర్‌ మంచి విజయంలో ఉన్నపుడు ఆమె ఒక క్రికెటర్‌తో ప్రేమలో పడిందంటూ పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ రూమర్లపై నిధితోపాటు ఆ క్రికెటర్‌ కూడ స్పందించారు.. తమ మధ్య ఏమీ లేదని స్పష్టం చేశారు. తామిద్దరం బెంగళూరుకు చెందిన వాళ్లమని, తాను సినిమాల్లోకి రాకముందు అతను అంతర్జాతీయ క్రికెటర్‌ కాకముందు స్నేహితులమని చెప్పింది నిధి.. ఒకే నగరం నుంచి వచ్చాం.. కామన్‌ ఫ్రెండ్స్‌ కూడ ఉన్నారు. కాబట్టి అందరం డిన్నర్‌ చేశాం.. అందులోతప్పేముంది ఆ మాత్రానికి లింకులు పెట్టేస్తారా అని ప్రశ్నించింది అమ్మడు..