గొడుగు కావాలా.. పైనాపిల్ కావాలా?

Nidhi Agarwal Tweet
Actress Nidhi Agarwal

కొత్త తరం భామ నిధి అగర్వాల్ ఈమధ్యే ‘ఇస్మార్ట్ శంకర్’ తో బాక్స్ ఆఫీస్ వద్ద తొలి విజయాన్ని నమోదు చేసింది. తెలుగులో నటించిన మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఈ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉంది.  ఈ జోష్ తోనే తాజాగా నిధి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక జోక్ పేల్చింది.
ట్విట్టర్ ఖాతాలో హాట్ గా ఉండే ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు “ముంబైలో ఎవరికైనా గొడుగు కావాలా.. పైనాపిల్ కావాలా?” అంటూ  ట్వీట్ పెట్టింది.  ముంబై నగరాన్ని గత వారం రోజులుగా భారీ వర్షాలు పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే.  ముంబైలో చాలా ఏరియాలు నీట మునిగాయి.  స్కూల్సుకు.. కాలేజీలకు.. ఆఫీసులకు శెలవులు ప్రకటించారు.. మరి ముంబైవాసులు నానా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో సింహాద్రి సినిమా పాట ‘చిన్నదమ్మే చీకులు కావాలా’ లిరిక్స్ లో ‘ఆకులు కావాలా పోకలు కావాలా సోకులు కావాలా పూతరేకులు కావాలా?’ అన్నట్టుగా ముంబై వాసులను ఇలా నాటీగా అడగడం సహజంగా ఎవరికైనా కోపం తెప్పిస్తుంది.
ఎక్కువమంది చిలిపి జవాబులు ఇచ్చారు.  ఒకరు  “అవి కెఎల్ రాహుల్ కు ఇచ్చావుగా!” అని కామెంట్ చేయగా.. మరొకరు “నేను బనానా ఇస్తా సలాడ్ చేసుకో” అంటూ టెంప్ట్ రవి తరహా పంచ్ రిప్లై ఇచ్చాడు. మరొకరు “అందరూ కశ్మీర్ ఇష్యూ తో కిందామీద అయిపోతుంటే నువ్వు పైనాపిల్స్ అమ్ముతున్నావా?” అంటూ కసురుకున్నాడు.  అయితే రిప్లైస్ లో  ఎక్కువమంది రెండు పైనాపిల్స్ అడిగారు.. ఎందుకో..!?