వైరస్ రక్త కణాలకు అంటకుండా అడ్డుకుంటున్న నికోటిన్!

ఫ్రాన్స్ లో తాజా అధ్యయనంలో వెల్లడైన కొత్త విషయం

Smoker
Smoker

ఫ్రాన్స్‌: కరోనా మహమ్మారి వాక్సిన్‌ కోసం ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే పోగాకులోని నికోటిన్ కరోనా వైరస్ శరీరంలోని రక్త కణాలకు అంటకుండా సమర్థవంతంగా పనిచేస్తోందని ఫ్రాన్స్ కు చెందిన రీసెర్చర్ల బృందం చెబుతోంది. తాము పరిశీలించిన గణాంకాలు దీన్నే నిరూపిస్తున్నాయని, అయితే, ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఓ నిర్ధారణకు రాకుండా, మరింత అధ్యయనం చేస్తున్నామని అధ్యయనకర్తల్లో ఒకరైన జహీర్ అమౌరా వ్యాఖ్యానించారు. పారిస్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కరోనా చికిత్స నిమిత్తం చేరిన 343 మందితో పాటు, స్వల్పంగా వైరస్ లక్షణాలున్న 139 మందిని పరిశీలించామని, వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే పొగతాగే వారున్నారని ఆయన తెలిపారు. ఫ్రాన్స్ లో 35 శాతం మంది ప్రజలు స్మోకర్లేనని గుర్తు చేసిన ఆయన, ఆ నిష్పత్తి ప్రకారం, పొగతాగే వారిలో 150 మందికి పైగా వ్యాధి సోకాలని, కానీ అది జరుగలేదని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/