నిజామాబాద్‌ జిల్లాలో శ్రీమంతుడు

సైకిల్‌పై సామాన్యుడిలా ఆసుపత్రికి వెళ్లిన కలెక్టర్‌

narayana reddy
narayana reddy

నిజామాబాద్‌: ఆయన జిల్లాకే ఉన్నాతాధికారి ఆయన ఎక్కడికెళ్లినా సిబ్భంది వెంటే వుంటారు. అటువంటిది ఎలాంటి హడావిడి లేకుండా ఒంటరిగా సైకిల్‌పై వెళ్లి ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా రెండు రోజుల క్రితమే నారయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నిన్న ఉదయం ఆయన సాధారణ వ్యక్తిలా సైకిల్‌పై నిజామాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. కానీ ఎవరూ ఆయన్ను గుర్తించలేదు. అక్కడి రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్యసేవల తీరుపై ఆరా తీశారు. ఓ రోగిని ఎవరూ పట్టించుకోకుంటే అతడికి వైద్యం అందించమని వైద్యులను కోరారు. నారయణరెడ్డి మాటలను అక్కడి వైద్యులు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆయన తాను కలెక్టర్‌నని చెప్పేసరికి ఉరుకులు పరుగులతో అక్కడి రోగికి వైద్యం చేశారు. ఇంకా ఆసుపత్రి సిబ్బందికి సంబంధించిన బయోమెట్రిక్‌ హాజరును కలెక్టర్‌ పరిశీలించారు. వైద్యులు, ఉద్యోగులు మొత్తం 210 మంది విధులు నిర్వర్తించాల్సి ఉండగా, వారిలో 111మంది హాజరు నమోదు కాలేదు. ఈ 111 మందికి కలెక్టర్‌ ఆఫీసు నుంచి మోమోలు పంపించనున్నట్లు తెలిపారు. తర్వాత కాన్పుల వార్డులోకి వెళ్లి అప్పుడే పుట్టిన చిన్నారిని కలెక్టర్‌ ఎత్తుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/