జామియా యూనివర్సిటీకి నేడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ

సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, పోలీసుల లాఠీచార్జి వంటి అంశాలపై ఈ బృందం విచారించనుంది

National Human Rights Commission
National Human Rights Commission

న్యూఢిల్లీ: జామియా యూనివర్సీటీలో నేడు జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) బృందం పర్యటించనుంది. యూనివర్సిటీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, పోలీసుల లాఠీచార్జి వంటి అంశాలపై ఈ బృందం విచారించనుంది. గాయపడిన విద్యార్థులతో మాట్లాడి వారి వాంగ్మూలాన్ని సేకరించనున్నారు. పౌరసత్వం సవరణల చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా డిసెంబరు 15న యూనివర్సిటీలో జరిగిన ఆందోళన కార్యక్రమాలను అడ్డుకునే క్రమంలో పోలీసులకు, జామియా విద్యార్థులకు తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ భాగంగా ఆందోళనకారులు నాలుగు బస్సులకు నిప్పంటించడమే కాక పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు విద్యార్థులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై జామియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ నజ్మా అక్తర్‌ మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం యూనివర్సిటీలో పర్యటించిందని, వారికి అవసరమైన వివరాలను అందజేస్తామని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/