యుపి ప్రభుత్వానికి, డిజిపికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

NHRC
NHRC

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుషం చోటు చేసుకుంది. గజియాబాద్‌ బాబూఘర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. తండ్రి, బంధువులు కలిసి మహిళను విక్రయించారు. బాధితులరాలిని కొనుగోలు చేసిన వ్యక్తి ఆమెను పలు ఇళ్లలో పనిమనిషిగా మార్చాడు. దీంతో ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సియం యోగి ఆదిత్యనాథ్‌కు మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ లేఖ రాయడంతో విషయం వెలుగు చూసింది. ఈ ఘటనపై తాజాగా జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. బాధితురాలి ఆత్యహత్యాయత్నం ఘటనలపై ఎన్‌హెచ్‌ఆర్సీ సోమవారం స్పందించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి ,డిజిపికి నోటీసులు పంపింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లోగా వివరాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని , డిజిపిని ఆదేశించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/