హైదరాబాద్‌ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

వివరాలు కోరిన మానవ హక్కుల సంఘం

NHRC
NHRC

న్యూఢిల్లీ: దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని వారు అంటున్నారు. అయితే, దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ పై స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ )హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తమకు సమాధానం చెప్పాలని సూచించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసినట్లు జాతీయ మానవ హక్కుల సంఘం తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/