టోల్‌ వసూలుకు సిద్దమవుతున్న ఎన్‌హెచ్‌ఏఐ

ఈ నెల 20నుంచి వసూలుకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి

toll gate
toll gate

దిల్లీ: ఈ నెల 20 నుంచి టోల్‌ వసూలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాదికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రంగం సిద్దం చేస్తుంది. గత నెల రోజులుగా ఆగిన టోల్‌ వసూళ్లు మళ్లి వసూలు చేయమని కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్‌ఏఐకి లేఖ రాసింది. ఈ నిర్ణయంతో రవాణా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైందని, ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిత్యవసరా సరుకులు రవాణా కొనసాగిస్తున్న ఈ తరుణంలో ఈ నిర్ణయం సరికాదని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌(ఏఐఎంటీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రవాణా రంగాన్ని ఆదుకోవాలి కాని మరింత ఇబ్బందుల్లోకి పడేసే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/