మహారాష్ట్రకు శివసేన నుంచే సిఎం

Sanjay Raut
Sanjay Raut

ముంబయి:మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నెల 10లోపు కొత్త సిఎం ప్రమాణ స్వీకారం చేయకపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్న నేపథ్యంలో ఎన్సీపీతో శివసేన చర్చలు జరిపింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో శివసేన నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమ రాష్ట్ర తదుపరి సిఎం శివసేన నుంచే ఉంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరోసారి అన్నారు. తమ రాష్ట్రంలో సిఎం రేసులో శరద్‌ పవార్‌ లేరని స్పష్టం చేశారు. తాను శరద్‌ పవార్‌తో మాట్లాడానని, అంతేగాక, ఇతర పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కాగా, ఈ నెల 9తో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ నెల 10లోపు కొత్త సిఎం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/